Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము Telugu Christian Song Lyrics

మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము Lyrics


మహిమాన్వితము మనోహరము
నీ దివ్య సన్నిధానము (2)
నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య
నీవే కావాలని యేసయ్య (2)     ||మహిమాన్వితము||

కోరలేదు ధన సంపద
కోరినాను నిను మాత్రమే (2)
ఐశ్వర్యము కంటే అధికుడవు (2)
నీ ఆశ్రయమే చాలునయా (2)       ||నిన్నే||

జీవపు ఊటలు కల చోటికి
జీవ నదులు పారే చోటికి (2)
ప్రేమతో పిలచిన నా యేసయ్యా (2)
నా దాహమును తీర్చెదవు (2)        ||నిన్నే||

తేజోనివాసుల నివాసము
చేరాలనునదే నా ఆశయ్యా (2)
యుగయుగములు నే నీతో ఉండి (2)
నిత్యారాధన చేయాలని (2)        ||నిన్నే||

Your favourites

  • No Favourites found!