Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా Telugu Christian Song Lyrics

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము నా Lyrics


మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా (2)
ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా (2)         ||మహోన్నతమైన||

లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)
బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)
ఘనపరతును నా దేవుని
స్తుతియింతును నా దేవుని – (2)       ||విరిగిన||

మహా మహిమతో నీవొచ్చు సమయమున
కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2)
హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2)
సంతోషింతును నా యేసుతో
ప్రకాశింతును ఆ మహిమలో – (2)       ||విరిగిన||

Your favourites

  • No Favourites found!