Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మమ్మున్ సృజించిన దేవుండు ప్రాణమునొసంగి యెప్పుడు Telugu Christian Song Lyrics

మమ్మున్ సృజించిన దేవుండు ప్రాణమునొసంగి యెప్పుడు Lyrics

1. మమ్మున్ సృజించిన దేవుండు - ప్రాణము
నొసంగి యెప్పుడు - కాపాడు మమ్మును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
2. పలువిధాలుగా - బాధించు రోగముల్
పోఁగొట్టి మీదను - రాకుండఁజేసెను
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గము
నాయత్తపరచి - చూపించె మాకును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁ
దా సొంత పుత్రుని - బంపెన్ సు ప్రేమతో
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్
5. ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షము
సర్వజనాళికి - ననుగ్రహించును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

Your favourites

  • No Favourites found!