Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు Telugu Christian Song Lyrics

మన దేవుని పట్టణమందాయన పరిశుద్ధ పర్వతమందు Lyrics

మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు
యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు
1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము
ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది
2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు
రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి
3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెను
తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు
4. సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు
మనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి
5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడు
దేవా నీ ఆలయ మందున నీ కృపను ధ్యానించితిమి
6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును
భూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది
7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడు
మనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా ఆమెన్


Your favourites

  • No Favourites found!