Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి Telugu Christian Song Lyrics

మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి Lyrics

మన మొదటి తల్లిదండ్రులల్ మాయకు లోనైరి అన్నలారా వారి
కనుగొనలకు సిగ్గు గదుర మోములు వంచి రన్నలారా ||మన||

1. తమ నగ్నతను జూడఁ దా మొప్ప లేరైరి అన్నలారా కొన్ని యమరిన
మఱ్ఱాకు లంగంబులను గట్టి రన్నలారా ||మన||

2. పరమాత్ముఁ డిడు నాజ్ఞఁ పాలింప లేరైరి అన్నలారా పూర్వ పరి
శుద్ధత నెడబాసి పాపాత్ములై పోయి రన్నలారా ||మన||

3. నరవంశజుల కెల్లఁ తరలెఁ దద్దురవస్థ అన్నలారా క్రీస్తు మర
ణంబు మన పాప హరణంబుఁ గావించు నన్నలారా ||మన||

Your favourites

  • No Favourites found!