Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో కానాను Telugu Christian Song Lyrics

మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో కానాను Lyrics

మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో
కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో
1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో
ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి
మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము
2. జీవ జలనది - పారు నాసనమునుండి
ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు
నెల నెల కాయును - పండ్రెండు కాపులను
3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు
నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము
నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను
4. తేజోమయునితో - మరి తేజోవాసులతో
తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు
సజీవ జనకుని - సజీవ జనులమని
5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు
కరువు మరణములు - కానము ఎన్నడును
మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము


Your favourites

  • No Favourites found!