Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనకై యేసు మరణించె మన పాపముల Telugu Christian Song Lyrics

మనకై యేసు మరణించె మన పాపముల Lyrics

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె
1. తృణీకరింపబడె విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
2. మన వ్యసనముల వహించెన్ - మన దుఃఖముల భరించెన్
మన మెన్నిక చేయకయే - మన ముఖముల ద్రిప్పితిమి
3. మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాథుడు శిక్షనొందె - మనకు స్వస్థత కలిగె
4. గొర్రెలవలె తప్పితిమి - పరుగిడితిమి మనదారిన్
అరుదెంచె కాపరియై - అర్పించి ప్రాణమును
5. దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తననోరు తెరువలేదు - మనకై క్రయధనమీయన్
6. ఎదిరింప లేదెవరిన్ - లేదే కపటము నోట
యెహోవా నలుగగొట్టెన్ - మహావ్యాధిని కలిగించెన్
7. సిలువలో వ్రేలాడెన్ - సమాధిలో నుండెను
సజీవుండై లేచెన్ - స్తోత్రము హల్లెలూయ


Your favourites

  • No Favourites found!