Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనమేసుని వారలము తనవారిగానే యుందుము మనలను Telugu Christian Song Lyrics

మనమేసుని వారలము తనవారిగానే యుందుము మనలను Lyrics

మనమేసుని వారలము - తనవారిగానే యుందుము
మనలను రక్షించెను - తనకే స్తుతి పాడెదము
1. కృపాసత్య సంపూర్ణ వాక్యము - నరరూపియాయెను
కనుగొంటిమి తండ్రి మహిమను - జనితైక కుమారునిలో
తన ప్రేమ అద్భుతమైనది - మనము కొనియాడెదము
2. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగెను
మనలను తానే వెలిగించెను - తన వాక్యము ద్వారనే
ప్రభు వుత్తముడని యెరిగి - తనకే స్తుతి పాడెదము
3. దైవపుత్రుండు సజీవరాళ్ళతో - యింటిని కట్టుచున్నాడు
దేవుని తేజము రాగా - మహిమతో నిండె గృహము
ఆయన మందిరములో - తన మహిమను పాడెదము
4. ఎందరిని ప్రభు ముందు యెరిగెనో - వారిని నిర్ణయించెను
పిలిచి నీతిగా తీర్చి - మహిమ పరచెను
తన తనయుని రూపమిచ్చె - మన మానంద మొందెదము
5. పూర్ణమహిమతో మనప్రభు యేసు - దూతలతో వచ్చును
కనిపెట్టు వారెత్తబడెదరు - తన మహిమ పొందెదరు
తన రాజ్యముగా జేసె - హల్లెలూయ పాడెదము
6. మహిమ నివసించు మహిమ రాజ్యంబు
మహిమతో నిండి యుండును
మన ప్రభువే దీపమై యుండును
తన వెలుగు ప్రచురమగున్
యుగయుగములు మనమంతా
ప్రభుయేసుతో నుండెదము


Your favourites

  • No Favourites found!