మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల
నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి ||మనమీ||
1. మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక
వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి ||మనమీ||
2. ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర
నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి ||మనుమీ||
3. సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ
ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి ||మనుమీ||
4. చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు
నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల ||మనుమీ||
5. బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు
యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ ||మనుమీ||
6. నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ
నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి ||మనుమీ||
7. అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు
విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ ||మనుమీ||
8. అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు
నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ ||మనుమీ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మనమీ మనుమీ మనస నీ వనుదినము Lyrics
Your favourites
- No Favourites found!
