Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే Telugu Christian Song Lyrics

మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే Lyrics

మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు
క్షీణం బగుచున్నది గదవే ||మనసా||

1. చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక
యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||

2. లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన
ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||

3. మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని
నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||

4. రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే
సమయము తక్షణమున వేఁడు ||మనసా||

5. అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని
పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా||

Your favourites

  • No Favourites found!