Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసానందముఁ బొందుట కన్నను మరి యే Telugu Christian Song Lyrics

మనసానందముఁ బొందుట కన్నను మరి యే Lyrics

మనసానందముఁ బొందుట కన్నను మరి యే భాగ్యము గల దన్న
అనుమానము లిఁక సఖిల సుఖంబులు దిన మొక గడికొక తీరై
యుండును ||మన||

1. దిటముగఁ ప్రార్థన యను ఖడ్గముఁ గని తిరుగు పిశాచము వెఱ చన్న
పటుదీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పం కము నింకించును
||మన||

2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి సమకూడిన మేలౌ నన్న శోధన లన్నిటి
స్థిరముగ నోర్చెడి శుభమతి కన్నను సుఖమే మున్నది ||మన||

3. తనువున దానను వానికి దురితము దగిలెడు విధిఁ గనవలె నన్న
యొనర గ క్రీస్తుని వధ్యాస్తంభముఁ గని విశ్వాసముఁ గట్టిగఁ బెంచిన
||మన||

4. క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన శత్రువు లిఁక భువి లేరన్న
సమదృష్టి జగ జ్జనుల గనుంగొను సత్క్రైస్తవులకు సాధన మనఁ దగు
||మన||

5. పరమదయానిధి క్రీస్తుని బలమునఁ బాప భరంబులు విడు నన్న
పరిశుద్ధాత్ముని బంధుత్వంబున అరమర చీఁకటు లన్నియుఁ దొలఁ
గును ||మన||

Your favourites

  • No Favourites found!