Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు Telugu Christian Song Lyrics

మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు Lyrics


మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు (2)
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు (2)        ||మనసెరిగిన||

నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా (2)
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా (2)
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా (2)
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు (2)        ||మనసెరిగిన||

Your favourites

  • No Favourites found!