Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు Telugu Christian Song Lyrics

మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు Lyrics

మనస్సార కృతజ్ఞత లిడుచు ఘనంబు చేయు ప్రభున్
1. విరివిగ నాశీర్వాదము లొసగున్
మరువకు యేసుని యుపకారం
ధర నీకున్నది దేవునిదే యని
కోరిన ప్రబుకిడు త్వరపడుచు - ఘనంబు
2. దర్శించిన నీ దయగల ప్రభువునకు
హర్షముతో కొట్లను విప్పి
విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు
అర్పించి కొనియాడెదము - ఘనంబు
3. తనయునిలో మన కన్నియు నిడెను
మనలను ముందే తనకిడెను
పానార్పణముగ ప్రభుకర్పించి
కాలంబంతయు గడిపెదము - ఘనంబు
4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము
ఎంతో మెళకువతో నుండి
చింతింపక నిడుటే సరియర్పణ
వింతగు వృద్ధిని పొందెదము - ఘనంబు
5. పిసినితనంబుగ దోషార్పణ నిడ
వాసము చేయును లేశములు
యేసునికి నీ జీవనమియ్యను
శాసనమిదె ప్రభుదని యెరుగు - ఘనంబు
6. ఘనపరచును ప్రభు - మనస్సారగ నిడ
కానుకగా బలకాలములు
మన కెన్నో తన గుణముల నిడి
ఘనమును బలమును ప్రభువొసగున్ - ఘనంబు
7. మకెదొనియ సంఘము వలె నీకు
సకల ఇక్కట్లుండినను
శక్తికి మించి సాగిన గాని
మక్కువగా నిడి మనమిలను - ఘనంబు


Your favourites

  • No Favourites found!