Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనస యేసు మరణ బాధ లెనసి Telugu Christian Song Lyrics

మనస యేసు మరణ బాధ లెనసి Lyrics

మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరుఁ జూడవే యా
ఘనునిఁ గూడవే నిను మనుప జచ్చుటరసియే మరక వేఁడవే ||మనస||

1. అచ్చి పాపములను బాప వచ్చినాఁడఁట వా క్కిచ్చి తండ్రితో నా
గెత్సెమందున తాఁ జొచ్చి యెదను నొచ్చి బాధ హెచ్చుగనెనఁట
||మనస||

2. ఆ నిశోధ రాత్రి వేళ నార్భటించుచు న య్యో నరాంతకుల్ చేఁ
బూని యీటెలన్ ఒక ఖూని వానివలెను గట్టి కొంచుఁబోయిరా
||మనస||

3. పట్టి దొంగవలెను గంత గట్టి కన్నులన్ మరి గొట్టి చెంపలన్
వడిఁ దిట్టి నవ్వుచున్ నినుఁ గొట్టి రెవ్వ రదియు మాకుఁ జెప్పుమనిరఁ
ట ||మనస||

4. ముళ్లతోడ నొక కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టి రెల్లు కఱ్ఱతో నా కల్ల
జనములు రా జిల్లు మనుచుఁ గొట్టి నవ్వి గొల్లు బెట్టిరా ||మనస||

5. మొయ్యలేక సిల్వ భరము మూర్ఛ బోయెనా అ య్యయ్యో జొక్కెనా
యే సయ్య తూలెనా మా యయ్యనిన్ దలంపగుండె లదరి
పోయెనా ||మనస||

6. కాలు సేతులన్ గుదించి కల్వరి గిరిపై నిన్ గేలిఁజేయుచు నీ
కాళ్లమీఁదను నినుప చీలలతోఁ గ్రుచ్చి నిన్ను సిల్వఁ గొట్టిరా ||మనస||

7. దేవ సుతుఁడ వైతి వేని తెవరంబుగా దిగి నీవు వేగమే రమ్ము
గావు మనుచును ఇట్లు గావరించి పల్కు పగర కరుణఁజూపెనా
||మనస||

8. తన్నుఁ జంపు శత్రువులకు దయను జూపెనా తన నెనరు జూపెనా
ప్రభు కనికరించెనా ఓ జనక యీ జనుల క్షమించు మనుచు వేఁ
డెనా ||మనస||

9. తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా న న్నేలువానికి నా పాలి
స్వామికి నే నేల పాపములను జేసి హింస పరచితి ||మనస||

10. గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు మా ట్లాడి ప్రేమ తో నా
నాఁడు శిరమును వంచి నేఁడు ముగిసె సర్వ మనుచు వీడె
బ్రాణము ||మనస||

11. మరణమైన ప్రభుని జూచి ధరణి వణఁకెనా బల్ గిరులు బగిలెనా
గుడి తెరయుఁ జీలెనా దివా కరుఁడు చీఁక టాయె మృతులు
తిరిగి లేచిరి ||మనస||

12. ఇంత జాలి యింత ప్రేమ యింత శాంతమా నీ యంతఃకరుణను
నేఁ జింత చేయఁగా నీ వింత లెల్ల నిత్య జీవ విధము లాయెనా
||మనస||

Your favourites

  • No Favourites found!