Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా Telugu Christian Song Lyrics

మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా Lyrics


మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా
మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వాచ్చావా
నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా

1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజదేవుడా

2. చంచల మనస్సాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పు బాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్ధిరమనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా

3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీనమనస్సుతో నీకడ శిరము వంచితి
పుర్ణశాంతి గలవానిగా నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా

Your favourites

  • No Favourites found!