Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంచి దేవుడు నా యేసయ్యాచింతలన్ని బాపునయ్యాహృదయ Telugu Christian Song Lyrics

మంచి దేవుడు నా యేసయ్యాచింతలన్ని బాపునయ్యాహృదయ Lyrics

మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనత ప్రభావము నీకే (2)
కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా||
మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా||
జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2) ||మహిమా||

Your favourites

  • No Favourites found!