Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) Telugu Christian Song Lyrics

మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) Lyrics


మంచి స్నేహితుడా మంచి కాపరివి (2)
అగాధ జలములలో నేను నడచినను
అరణ్య యానములో నేను తిరిగినను
నన్ను ఆదరించినావు ఓదార్చినావు
చేర దీసినావు కాపాడినావు (2)
నీకే ఆరాధన – నీకే ఆరాధన (2)
ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2)

తప్పిపోయిన నన్ను వెదకి రక్షించినావు
ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2)
ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు
ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు           ||ఆరాధన||

చెరలో ఉన్న నన్ను విడుదల చేసినావు
బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2)
నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు
నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు         ||ఆరాధన||

ఒంటరియైన నన్ను వేయిమందిగా చేసితివి
ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2)
నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2)          ||ఆరాధన||

Your favourites

  • No Favourites found!