Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు Telugu Christian Song Lyrics

మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు Lyrics


మంచివాడు గొప్పవాడు నా యేసు పరిశుద్ధుడు
మేలులెన్నో చేయువాడు నా యేసు అందరికి (2)
ఆదరణ ఆశ్రయము నీవేగా నాకిలలో (2)      ||మంచివాడు||

ఒంటరి వారిని వ్యవస్థగా వృద్ధి చేసే దేవుడవు
దీనులను పైకి లేవనెత్తి సింహాసనమెక్కించును (2)        ||ఆదరణ||

ఓటమి అంచున పడియుంటివా మేలుకో ఓ సోదరా
యేసయ్య నీ తల పైకెత్తి శత్రువును అణగద్రొక్కును (2)        ||ఆదరణ||

దుష్టుడా శత్రు సాతానా విజయము నాదిప్పుడు
నీ తల నా కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కెదను (2)        ||ఆదరణ||

ఆహా ఆహా ఆనందమే యేసయ్యతో జీవితం
సంతోషమే సమాధానమే ఎల్లప్పుడు ఆయనలో (2)        ||ఆదరణ||

Your favourites

  • No Favourites found!