మంగళమే యేసునకు మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే //మంగళమే//
1. పరమ పవిత్రునకు వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే //మంగళమే//
2. దురిత సంహారునకు వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే //మంగళమే//
3. సత్య ప్రవర్తునకు సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే //మంగళమే//
4. యుక్త స్తోత్రార్హునకు భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే //మంగళమే//
5. నర ఘోర కలుషముల నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే //మంగళమే//
6. పరమపురి వాసునకు నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే //మంగళమే//
