Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువున Telugu Christian Song Lyrics

మంగళమే యేసునకు మనుజావతారునకు శృంగార ప్రభువున Lyrics

మంగళమే యేసునకు - మనుజావతారునకు
శృంగార ప్రభువున - కు క్షేమాధిపతికి
1. పరమ పవిత్రునకు - వరదివ్య తేజునకు
నిరుప మానందునకు - నిపుణ వేద్యునకు
2. దురిత సంహారునకు - వరసుగుణోదారునకు
కరుణా సంపన్నునకు - జ్ౙానదీప్తునకు
3. సత్య ప్రవర్తునకు - సద్ధర్మ శీలునకు
నిత్యాస్వయంజీవునకు - నిర్మలాత్మునకు
4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి
సత్యపరంజోతియగు - సార్వభౌమునకు
5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు
పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు


Your favourites

  • No Favourites found!