Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో Telugu Christian Song Lyrics

మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో Lyrics

మంగళముఁబాడరె క్రీస్తునకు జయ మంగళముఁబాడరె యో ప్రియులారా
మంగళముఁ బాడరెర్ మంగళముఁ బాడి దు స్సంగతిని వీడి ప్రభు
సంగులను గూడి మదిఁ బొంగుచుఁ జెలంగుచును ||మంగళము||

1. రాజులకు రాజని దూతలచేత పూజఁగొనువాఁడని తేజమున
సూర్యునికి దీప్తి నిడు సద్గుణ వి రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ
||మంగళము||

2. కరుణ గల వాఁడని పాపులఁబ్రోచు బిరుదుగొనినాఁడని మరణమును
దానిఁ బరి మార్చు ఘన శక్తిగల పరమ గురుఁడితఁదె మన పాలి
వాఁడని శుభ||మంగళము||

3. సంగీతము పాడుచు సువార్త ప్ర సంగములఁ గూడుచు నింగికిని
భూమికిని నిత్యముగ నేలఁ దగు శృంగారపు రాజునకు క్షేమ మగు
ఆమేనిని||మంగళము||

Your favourites

  • No Favourites found!