మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము త్రిత్వస
మాన్వితునకు మంగళము దూత జన మకుట మగు ప్రభువునకు
మంగళము వేదాంత మాన్యునకును జయ మంగళము సదా శుభ
మంగళము ||జయ||
1. కానాకుఁ జనుదెంచి కల్యాణమును మహిమ గా నొనరప్పను నీరు
గాంచి ద్రాక్షా పానముగ మార్చి నీ ప్రథమాద్భుత ప్రతిష్ఠ భూనుతుఁడ
తెల్పితివి మానితముగా ||జయ||
2. నీకు సంఘమునకు నిత్యమైన వివా హైకత్వమునకుఁ దగు నెచ్చరికగాఁ
గైకొనెడి నీ సేవక వరుల పరిణయము నీ కరుణచే ధరను నిముడుగాక
||జయ||
3. ప్రేమానుబంధమునఁ బెనగి యీ దంపతులు వేమారు నీ మహిమ
వెదకి భువిని కామాదులను గెల్చి కైవల్య పురమునకు క్షేమ మగు
కృపనిచ్చి చేరనిమ్ము ||జయ||
4. ఆదికాలము నాబ్ర హాము శారా లెంతో నీ దయలో బ్రతికి యిల
నెగడినట్టు ఈ దీన దంపతులు గాదిలిచే బ్రతుకుటకు నీ దయారసమొస
గు మక్షయుండా ||జయ||
5. సంతానము గాంచి సద్భక్తిలో బుద్ధి మంతులై క్రైస్తవ మతము నందు
అంత్యపర్యంతంబు నణుఁకువగఁ బెంచ నా ద్యంత రహితుండ స
హాయ మిమ్ము ||జయ||
6. కర్తయైన క్రీస్తు కరుణయు దేవుని పరమపూర్ణ ప్రేమ ప్రబలము గను
సురుచిరం బగు పరి శుద్ధాత్ము నైక్యత కలుగుఁగాక దంప తుల
కనిశము ||జయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మంగళము క్రీస్తునకు మహిత శుభవార్తునకు మంగళము Lyrics
Your favourites
- No Favourites found!
