Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మంగళముగ పాడుడీ కృప సత్యంబునురంగుగ జ్ఞానమిచ్చెడు Telugu Christian Song Lyrics

మంగళముగ పాడుడీ కృప సత్యంబునురంగుగ జ్ఞానమిచ్చెడు Lyrics

1. మంగళముగ పాడుడీ - కృప సత్యంబును
రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము
అమృతము అద్భుతము దివ్యసత్యము
2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును
3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు
4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము
5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
పాపికి జీవపానము - దివ్యవాక్యము
పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును
6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము
7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే

Your favourites

  • No Favourites found!