Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ Telugu Christian Song Lyrics

మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ Lyrics


మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము (2)        ||మనిషి||

గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును (2)
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా (2)
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)         ||మనిషి||

Your favourites

  • No Favourites found!