Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మన్నేగదయ్యా మన్నేగదయ్యా మహిలోని ఆత్మ జ్యోతియు Telugu Christian Song Lyrics

మన్నేగదయ్యా మన్నేగదయ్యా మహిలోని ఆత్మ జ్యోతియు Lyrics

మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)
మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము (2)
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా
నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2)
మెల్లని పుష్పంబు పోలినా
పుష్పంబుతోనే ఊడిపడినది (2) ||మన్నేగదయ్యా||
మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా (2) ||మన్నేగదయ్యా||
మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2)
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2) ||మన్నేగదయ్యా||

Your favourites

  • No Favourites found!