Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే Telugu Christian Song Lyrics

మనోవిచారము కూడదు నీకు మహిమ తలంపులే Lyrics


మనోవిచారము కూడదు నీకు - మహిమ తలంపులే కావలెను
= దిన క్రమాన శాంతి గుణంబులు - దీనుల కిచ్చు చుందును


1. ఆలస్యమైనంత మాత్రమున - అవి నెరవేరవనవద్దు
= కాలము పరిపూర్ణంబు కాగా - ఖచ్చితముగా అన్నియు నెరవేరును


2. నిత్యానందము సత్యానందము - నీలోనే నే నమర్చితి
= అత్యానందము అగపడుచుండును - ఆలోచించు చున్న కొలది


3. కోరవు నీకు కావలసినవి - ఊరకనే నీకిచ్చెదను
= ధారాళముగా నిచ్చుటకు నా - ధన నిధి వస్తువు లన్నియు గలవు


4. నీరసపడకుము నీరస పడకుము - నీవే నా ఆస్తి గదా
= నా రక్తముతో సంపాదించితి - నన్ను నీ ఆస్తిగ గైకొనుము


5. నీకు కావలసినవి అడుగుము - నేను తప్పక ఇచ్చెదను
= నీకు ఇచ్చుట నాకానందము - నీవు అడుగుట ముచ్చట నాకు


6. నీ కష్టములు నీ కోరికలు - నా కొరకే అవి యుండవుగా
= లేకుండగా జేసెదను అప్పుడు - లేడి వలె గంతులు వేయుదువు


7. నీ కవసరమైనవి కావలసిన - నిఖిల వస్తువుల కాజ్ఞాపింతును
= కాకుల కాజ్ఞ ఇచ్చి ఏలీ - యాకు ఆకలి తీర్చలేదా


8. సైకిళ్ళు స్టీమర్లు బండ్లు - సంచారమునకు అవసరమా !
= లోకులు కోరిన యెడల అవియూ - నీ కవి సులువుగా లభియించు


9. ఎండయు, చలియు, వానయు, గాలియు - ఏమియు చేయనేరావు నిన్ను
= తిండికి, బట్టకు, బసకు, శుద్ధికి - తీరికకు ఏ కొదువయే యుండదు


10. జంతువు, పశువు, పురుగు, పక్షి - జబ్బు ఏమియు చేయవు నీకు
= సంతోషముతో నా సందేశము - చాటగా అదియూ చాటుచునుండును


11. నీ బలహీనత తట్టు చూడకు - నా బలము తట్టిదిగో చూడుము
= నీ బలమునకు మించిన పనులు - నా బలమే గదా చేయవలెను


12. పాపివని నీకెవడు చెప్పెను - పావనుడవై యుండగను
= శాప మరణము రాదు నీకు - చావును చంపిన జీవము నేనే


13. నా రూప లావణ్యములు - నీ రూపలావణ్యములగును
= నా రక్తము ప్రతి నిమిషము నీలో - ధారగా ప్రవహించును అది జీవము


----------------------------------- శత్రువులు -----------------------------------


14. నా దూతలు పరలోక శుద్దులు - నరలోకమునందలి విశ్వాసులు
= నా దరిని నిలిచి నీ కొరకు - నను ప్రార్ధింతురు ఏమి భయము


15. శత్రువుల పత్రికాదులు నా - సన్నిధి లోనికి వచ్చినవి
= స్తోత్రము చేయుము అపుడవి - ధూళి క్రింద నెగుర గొట్టివేతును


16. నిన్నెవరైననేమియు అన్నను - నేను ఊరు కొందునా
= నన్నన్నట్టే భావించు కొని - నరులకు తీర్పు విధింపనా


17. ఎవరేమియు నిన్నన్నను నీవు - ఏమియు అనకు బెదరకు వినకు
= అవి విని ప్రార్ధించుము క్షమియించుము - ఆశీర్వాద మిమ్ము మనసున


18. పగవారి యత్నములు చూచి - పక పక నవ్వు చుండుము
= తెగ నరుకునది నీలో యున్నది - లెమ్ము వాడుము శూరుని వలెనె


19. పగవారు హాని చేయుటకై - పట్టు కొందురు అయినను నీవు
= ఎగిరి పోదువు గనుక వారు - ఏమియు చేయ లేరు నిన్ను
----------------------------------- సాతాను -----------------------------------
20. వెలుగు దూత వలె సైతాను - కలలో మాటలాడును
= పలుకును, రూపును బట్టి అతనిని - పారద్రోలుము పారిపోవును


21. సాతానును మృత్యువును పాప - శాపాదులను గెలిచితిని
= నా తర్వాత వీటిని గెల్వ - నా సభకు సత్తువ నిచ్చితిని


22. నీకు తెలియకుండా నిన్ను - నేలను పడవేయును సైతాను
= ఆ కార్యంబు నీ యపరాధ - మై యుండదు క్షమియింతును నేను


28. మరలా ఆ స్థితి తట్టు నీవు - మరల రాదు మరలిన యెడల
= బురదను కడిగిన జీవి మరల - బురదను పొరలిన దుస్థితి యబ్బును


29. పేతురు పడెను తనకు తెలియదు - కూత వినబడు కోడి కూయగ
= నా తట్టు చూచి విలపించెను - ఆ తరుణ మండే క్షమియించితి


30. అవిశ్వాసులతో అత్తి యుండకుము - అది నీ కెంతయు అపాయము
= ఇవి రుజువులతో వివరించిననూ - ఎంత చెప్పినను నమ్మనే నమ్మరు


31. వివిధము లైన చెడుగులు మాని - వేయుచు నడుచు కొనవలెను
= ఎవరైనా నను మాత్రమే ఆశ్ర - యించిన మోక్షములో చేర్చెదను


32. నా మాటలుగల బైబిలు చొప్పున - నడచుచు మాదిరి చూపుము
= ఏ మానవునికైనను సరియే - ఎంతయైనను భోదించుము


----------------------------------- సేవ -----------------------------------


33. ఎన్నో అద్భుతములు నీ చేత - యేసును స్వయముగా చేయింతు
= సున్న చుట్టెద వ్యతిరిక్తములకు - చూచుకొనుము నా శక్తి ప్రభావము



34. నీ చేత మంచి పనులెన్నో - నేను చేయించుచున్నాను
= ఈ చిత్రము నీకేమియు తెలియదు - ఇప్పుడే గంతులు వేయగలవు


35. పనులు జరుగుట లేదని అను - కొనవద్దు అనవద్దు
= మన మిద్దరము నందరమూ నా - పనిలో నుండగా ఫలమెట్లుండదు


36. బహిరంగముగా ఫలితములు కన - బడకున్నవని అనవద్దు
= బహుగా అంత రంగము నందలి - ఫలములు నాకు కనబడుచున్నవి


37. వాదములు కలహములు మాని - వరుసగా సత్యము వినవలెను
= వాదము వలన భేదము పెరిగి - వరుసయే మొదలంటును చెడిపోవును

38. ఎన్ని ప్రార్ధనలు చేసిన కొందరు - ఏమియు మారనే మారరుగా
= ఖిన్నుడవై యుండకుము నీది - క్రీస్తుది నేరము కాదు కాదు


39. ఎలియాజరును కార్యసిద్ధి - స్థలమునకు నడిపింప లేదా ?
= తెలుపకుండానే విశ్వాసులకు - తిన్నగా పనికి నడిపింప లేనా !


40. అన్ని భాషలతో నా వార్త - అందరికి అందింతువు
= అన్ని భాషలు ఎక్కడ నేర్చు - కొన్నారని ప్రజలందురు


41. పెంతెకోస్తు పండగ నాడాత్మ - పేతురాది శిష్యులకు
= వింతగా నొక్క నిమిషములోనే - విదేశ భాషలు నేర్ప లేదా


42. నేను పనులు చెప్పిన వారికి - నేను సొమ్ము ఇచ్చెదను
= నేను చెప్పని పనులు నావి - యైనను చేసిన క్షమించెదను


43. పాపము పాప ఫలితము చెప్పి - భయ పెట్టుట మంచిదే కాని
= పాపులు చెదిరి పోవుదురు నా - పంచకు రానే రారు రారు


44. పడినను పడిపోతి ననవద్దు - వడిగా లెమ్ము రమ్ము రమ్ము
= పడినా నన్న సైతానునకు - వశము చాడీ చెప్పును నాకు


45. ముమ్మరముగా భోధించిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు
= ముమ్మరముగా మేల్ చేసిన బలవం - తమ్ముగ ప్రజలను తేగలవు


46. నేను నీలో నీవు నాలో - లీనమైనట్టే యను కొనుము
= గాన నీకు లేని దేది - పోని దేది రాని దేది


47. సమస్త దేశములలో జీవ - సౌకర్యము కలుగును నీకు
= అమాంతముగా దేశస్తులు నిన్ను - అన్ని చోట్ల కెత్తు కొని పోదురు


48. అడిగిన వివిగో అని అన్నాను - అందుకొనక ఊరకనే యుంటివి
= గడిచెను ఇట్లు ఎన్నో దినములు - కష్టములు తీరలేదు అయినను


49. నీ వస్తువులను ఎక్కడికైనా - దేవదూతలు కొని పోగలరు
= నీవు కోరిన వీలును బట్టి - నిన్ను కూడను కొనిపోగలరు


50. ఎల్లవారిని రక్షించుటకు - ఎన్నో తిప్పలు పడుచున్నాను
= అల్లరిగా మాట్లాడు కొందురు - అన్యులు ఈ సంగతి గ్రహింపక


51. సంసోను బలము నీకిచ్చెద - సంతోషించుము సంతోషించుము
= హింసలన్నియు ప్రోగు చేయుము - ధ్వంసము చేయుము ధ్వంసము చేయుము


52. ఘనతయు కీర్తియు గలుగును నీకు - గానము చేయుము గానము చేయుము
= వినయమును భూషణముగా దాల్చి- ఘనపర్చుము నా నామ మంతట


53. నిన్నయాస పెట్టెడి వార్త - విన్నా బెదర కున్న శాంతి
= నన్నా సమయమందున నీ - కన్ను చూచు చున్నా విశ్రాంతి


54. నా బోధలు కొందరికి కొన్ని - నచ్చ జెప్పిన ముగియునా
= మీ భూగోళ మంతటికీ అవి - మిగుల త్వరగా పంపా లేవా !


55. నేను నీ పాపములు క్షమింతును - గాని నరులు క్షమింతురా
= గాన నీ తల వారి చేతుల - లోనికి వెళ్ల నీయరాదు


56. నీ పాపముల తట్టు చూడను - నీలోనున్న ఆశను జూతును
= పాప క్షమాపణ కొరకై వేడుము - నా పరిశుద్ధత వైపే చూడుము


57. ఆకాశము భూమియును పోయినా - నాకు పోయిన దేమియు లేదు
= నాకు నీవొక్కడవే యున్న - నాకు సమస్తమున్నట్టే

58. నా యవతారమునకు ముందే - నీ అపరాధములు మోసితిని
= నీ యతి క్రమాలు గెల్చితిని - నీకు బదులై నాను గనుక


59. రక్షణ పత్రిక లెన్నో కోట్లు - రాజ్యములన్నిట చల్ల వలెన్
= శిక్ష ప్రజలకు తొలగింపుము నీ - సిద్ధాంత బోధనల వలన


60. అర్ధము కాని విషయములకు నీ - వాందోళన పడకు చింతింపకు
= అర్ధమైన సంగతులను బట్టి - ఆనందించుము అనుసరించుము


61. నేను పరిహారంబు చేయ - లేని కీడు లేనే లేదు
= నేను భువిలో దివిలో చేయ - లేని మేలు లేనే లేదు


62. నన్ను నమ్మి విద్య నేర్చు - కొన్న యడల పండితులే
= అన్నిటిలో నీ అపజయమే జయ - మగును జయమును జయమగును


----------------------------------- స్వస్థత -----------------------------------


63. నిన్ను రక్షించిన నేను - నీ స్వజనులను కూడా రక్షింతు
= కనిపెట్టి చూడుము నీకందరి - ననుగ్రహింతు నద్భుత రీతి


64. పేతురు నీడకే రోగులు బాగై - వేసిరి గంతులు సంతోషముతో
= నా తలంపు తోనే రోగులు - నయమై గంతులు వేయరా ?


65. మోషే వేసిన గుడార - మును పోలినది వేసెదవా !
= మోషేతో మాట్లాడిన విధముగా - మోదముతో నీతో మాట్లాడెద


66. నేను సృజించిన కొండలతోను - ప్రాణులతో, వృక్షాదులతో
= మానక మాటలాడుచూ వాటి - మనవులు ఆలకింతును


----------------------------------- రాకడ -----------------------------------


67. వార్తా పత్రికలందు రాకడ - గురుతులు తెలిసికొన గలవు
= గురుతులు తెలిసిన యెడల భక్తుల - కూడికలో సిద్ధ పడగలవు


68. నన్ను సిద్ధము చేయు మనుచు - నరుడు అడిగిన తోడ్పడనా ?
= నన్ను, నా వాక్యమును, సభను - మన్నన చేసిన కొనిపోనా ?


69. మనసున నెమ్మది గాంచిన యెడల - మహిమ శరీరము దాల్చెదవు
= అనుమానములను అణచి వేయుచు - ఆయత్తము చేసెదను నిన్ను


70. ఏలియ, యెహేజ్కెలు, ఫిలిప్పు - ఎగిరి ప్రయాణము చేసిన రీతి
= గాలిలో ఆత్మ నిన్ను గూడా - గ్రక్కున గొనిపోవుట కష్టంబా

Your favourites

  • No Favourites found!