మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహ
రంబు ఘనాదిప్రభుయశః ప్రకాశంబు ||మనో||
1. మందమారుతములందము నొసగగ డెందములకు నానందము నిడగా
సుందర పక్షుల సుమధురగానము సుఖావహంబై శోభించెనుగా ||మనో||
2. అరుణభాస్కరుని కిరణాకరము ధరదిక్తటముల దరిజేరెనుగా ధరా
వలయమాఖర భానునిచే ధగద్ధగీయంబై వెల్గెనుగా ||మనో||
3. పులుగిల కిలకిల కలరవములతో పొందుగ గలసిన భూరి రవంబు
లలితమనోహరశ్రావ్యమ వినుమా తలపన్ దానికి కారణమేమో ||మనో||
4. రయమున నొలీవ నగంబుగనుమా రభసయుక్తమగు జనమును గనుమా
జయంజయంబను జయ ధ్యానంబులు వియదంతము జనమ్రోగుట వినుమా
||మనో||
5. ప్రసన్నవదనుడు భానుతేజుడు అసంఖ్యజనగణ పరివృతబలుడు
ప్రసితరాసభాసీనుడు యేసుడు అసమ శాంతితో నరుదెంచెనహో ||మనో||
6. జయములు బాడెడు బాల చయముతో సాత్వికుడై రాసభంబు నెక్కి
జయోత్సవంబుతో సర్వేశ్వరుడు చనిహృదయము సమర్పించె దము ||మనో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మనోవిలసితంబౌ దినంబు మహిమాన్వితంబు అనంతజగతీమనోహరంబు ఘనాదిప్రభుయశః Lyrics
Your favourites
- No Favourites found!
