Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మనుజులార మంచి వార్త  మానుగాను Telugu Christian Song Lyrics

మనుజులార మంచి వార్త మానుగాను Lyrics

మనుజులార మంచి వార్త – మానుగాను దెచ్చినాడ
మనలన్ గావ మహిని నేడు – మనుజుడై జన్మించె నహహ
1.ఎంతో సంతసంబు గలిగె – నింతయని వర్ణింప దరమా
చింతలన్ని వీడి ప్రభుని – చెంతజేరి నుతించుమయ్యయ్యో ||మనుజులారా||
2.బేతలేము పురమునందు – బీద యింట స్థలములేక
దాత పశులశాలయందు – బ్రీతితో బరుండె నయ్యయ్యో ||మనుజులారా||
3.ఒక్క క్షణములోనే దూతల్ – గ్రక్కున మోక్షంబు విడచి
ఒక్క స్వరముతోను బాడి – మక్కువ నుతించిరయ్యయ్యో ||మనుజులారా||
4.సంతసంబని తాళములతో – యేసు జన్మదినమునందు
సంతసంబు సంతసంబు – సంతసంబని బాడు డహాహా ||మనుజులారా||

Your favourites

  • No Favourites found!