Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మణులు మాణిక్యములున్న మేడమిద్దెలు ఎన్నున్నా Telugu Christian Song Lyrics

మణులు మాణిక్యములున్న మేడమిద్దెలు ఎన్నున్నా Lyrics

పల్లవి:
మణులు మాణిక్యములున్న - మేడమిద్దెలు ఎన్నున్నా

మదిలొ యేసు లేకున్నా - ఏది వున్నా అది సున్నా

1.
చదువులెన్నో చదివున్నా - పదవులెన్నో చేస్తున్నా

విద్య వున్నా బుద్ది వున్నా - జ్ఞానమున్నా అది సున్నా
...మణులు...

2.
అందచందా లెన్నున్నా - అందలముపై కూర్చున్నా

సుందరుడగు ప్రభు లేకున్నా - అందమున్నా అది సున్నా
...మణులు...

3.
రాజ్యములు రమణులున్నా - శౌర్యములు గల వీరులున్నా

బలము వున్నా బలగమున్నా - ఎన్నియున్నా అవి సున్నా
...మణులు...

4
పూజ్యుడా పుణ్యాత్ముడా - పుణ్యకార్య సిద్దుడా

దానధర్మము తపము జపము - యేసు లేనివి అన్నీ సున్నా
...మణులు...

Your favourites

  • No Favourites found!