Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నామదిలో యేసులేకున్నా Telugu Christian Song Lyrics

మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నామదిలో యేసులేకున్నా Lyrics

మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా
మదిలో యేసులేకున్నా ఏది ఉన్నా అది సున్నా ||మణు||

1. చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో చేస్తున్నా
విద్యవున్నా బుద్ధివున్నా జ్ఞానమున్నా అది సున్నా ||మణు||

2. అందచందా లెన్నున్నా అండములపై కూర్చున్నా
సుందరుడు ప్రభులేక యున్నా అందమున్నా అది సున్నా ||మణు||

3. రాజ్యములు రమణులు ఉన్నా శౌర్యములు వీర్యము
లున్నా బలము ఉన్నా బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా ||మణు||

4. పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య సిద్ధుడా
దానధర్మము జపము తపము యేసులేనిది అదిసున్నా ||మణు||

Your favourites

  • No Favourites found!