Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి Telugu Christian Song Lyrics

మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి Lyrics

మరణము నన్నేమి చేయలేదు పరిస్థితి నన్నేమి చేయగలదు
నీ కృప సమృద్ధిగా నాపై నిలిపి తోడైయున్నావు 2
నీ రక్తమే నన్ను నీతిమంతుని చేసే
నీ వాక్యమే నాకు దేదీప్య వెలుగాయే
నన్ను సీయోనులో చేర్చుకొనుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
నీ రూపమును పొంది జీవించుటే ఆశ
సీయోను పాటలు గొర్రె పిల్లతో పాడి
విశ్వాసింపబోవు వారికీ మాదిరిగా నేనుండటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
నీ కొరకు శ్రమపడుటే నాకెంతో భాగ్యము
పరిశుద్ద పేదలను ఆదరింప కృపనిమ్ము
నా ముఖమును చూడని వారి కొరకు ప్రార్దించుటే
నా యెడల నీకున్న ఉద్దేశ్యమా
నీ కొరకు ఖైదీ నై వుండుటే ధన్యత
సంఘమును మేల్కొలిపే ఊటలు దయచేసి
దెయ్యాలు గడ గడ వనుకుచు కేకలు వేసే సేవ చేయుటే నా యెడల నీకున్న ఉద్దేశ్యమా

Your favourites

  • No Favourites found!