Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరణమున్ జయించి లేచెను మన ప్రభువు Telugu Christian Song Lyrics

మరణమున్ జయించి లేచెను మన ప్రభువు Lyrics

మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ
మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి
కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని ||మరణమున్||

1. మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు
దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ
దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ
||మరణమున్||

2. నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను
మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ
జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు ||మరణమున్||

3. వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల
భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార
భయపడకు డటంచు నూరడించె నుచితముగను ||మరణమున్||

4. కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు
చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు
రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె ||మరణమున్||

5. మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును
గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు
దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు ||మరణమున్||

6. మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య
వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ
బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు ||మరణమున్||

7. అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము
వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు
లేపు నమల దేహముల నొసంగు ||మరణమున్||

Your favourites

  • No Favourites found!