Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా Telugu Christian Song Lyrics

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా Lyrics

మరణమునకు విజయ మేది మరణ మోడిపోయెరా మరణ మొంది
యేసు ప్రభువు మఱల బ్రతికి లేచెరా ||మరణ||

1. క్షయమందు విత్తఁబడి య క్షయమునందు లేచురా ప్రియుడు క్రీస్తునందు
మృతులు పెం పొసంగు ధన్యులు ||మరణ||

2. లౌకిక దేహము విడి పర లోక దేహి యగునురా భీకర యోర్దాను
యేసు ప్రేమతో దాఁటించురా ||మరణ||

3. ధరణి దుఃఖ బాధ లన్ని ధరణియందె విడుతుము పరమ దేవుని డుండునట్టి
పరదైసునకుఁ బోదుము ||మరణ||

4. గగన వీధినండి యేసుఁ గ్రక్కున వేం చేయురా జగతి సర్వ మృతుల
నొక్క క్షణములో బ్రతికించురా ||మరణ||

5. బూర రావ మాలకించి భూమి యెల్ల వణఁకురా వారధిలో మృతులు
జీవ ధారులై లేచెదరురా ||మర||

6. భక్తులు విశ్వాసమునకు ఫలము నొందఁ బోదురు ముర్తి కిరీటము
ధరించి రక్తితో జీవింతురు ||మరణ||

7. కరుణలేని మరణమునకు వెరవకుండ నుండుఁడి మరణవిజయుఁడైన
ప్రభుని చరణములు నుతించుఁడీ ||మర||

Your favourites

  • No Favourites found!