Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా Telugu Christian Song Lyrics

మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా Lyrics


మరువని నీదు ప్రేమతో కాచితివే కనుపాపగా
విడువని స్నేహ బంధమై నడిచితివే నా తోడుగా (2)
ఇంతవరకు ఉన్న ఊపిరి నీదు దయకు సాక్ష్యమేగా
పొందుకున్న మేలులన్ని నీదు ఎన్నిక ఫలితమేగా (2)       ||మరువని||

కరుగుతున్న కాలమంతా నీదు కృపలో నన్ను తడిపె
వెలుగు పంచే నీదు వాక్యం నీదు మార్గము నాకు తెలిపె (2)
పాడెదను నూతన గీతములు ఎల్లవేళల స్తుతిగానములు
ఘనత మహిమ ఆరోపణము నాదు జీవితమే అర్పితము (2)       ||మరువని||

నిన్న నేడు ఎన్నడైనా మారిపోని మనసు నీది
తల్లి మరచినా మరచి పోక కాపు కాసే ప్రేమ నీది (2)
పొందుకున్న జన్మ దినము నీవు ఇచ్చే దయా కిరీటము
నీవు ఇచ్ఛే వాగ్ధానాలు చేయు అధికము బ్రతుకు దినములు (2)       ||మరువని||

Your favourites

  • No Favourites found!