Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును Telugu Christian Song Lyrics

మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును Lyrics


మీరు బహుగా ఫలించినచో
మహిమ కలుగును తండ్రికి
ఈ రీతిగా ఫలించినచో
శిష్యులై యుండెదరు (2)

నీరు కట్టిన తోటవలె
నీటి వూటవలె నుండెదరు (2)
క్షామములో తృప్తి నిచ్చి
క్షేమముగా మిమ్ము నడిపించును (2)
బలపరచును మీ యెముకలను (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

చెట్లులేని మెట్టలలో
నదుల ప్రవహింపజేయు ప్రభువు (2)
ఎండియున్న నేలనెల్ల
నీటిబుగ్గలుగా జేయువాడు (2)
మన ప్రభువైన యేసునందు (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

వడిగా ప్రవహించు నదిని బోలి
విస్తరింపజేయు తన శాంతిని (2)
ఐశ్వర్యముతో నింపు మిమ్ము
ముదిమివరకు మిమ్ము మోయువాడు (2)
మన ప్రభువైన యేసునందు (2)
అధికముగా ఫలించుడి (2)          ||మీరు||

పాడెదరు మూగవారు
గంతులు వేసేదరు కుంటివారు (2)
పొగడెదరు ప్రజలెల్లరు
ప్రభుని ఆశ్చర్య కార్యములను (2)
మహిమ ఘనత చెల్లించుచు (2)
హల్లెలూయ పాడెదరు (2)          ||మీరు||

Your favourites

  • No Favourites found!