Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా Telugu Christian Song Lyrics

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యాచావైనా బ్రతుకైనా Lyrics

మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2)
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా||
కలిమి చేజారి నను ముంచినా
స్థితిని తలక్రిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము పొంది నే కృంగినా (2)
నా మొర విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||

Your favourites

  • No Favourites found!