Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా యోచించుమా, Telugu Christian Song Lyrics

మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా యోచించుమా, Lyrics

మేల్కొనుమా, మేల్కొనుమా నా ప్రాణమా
యోచించుమా, మాటవినుమా పొందెదవు సర్వమున్
1. యేసు పాదముల యొద్దకురా యేసు కర్పించు నీజీవితము
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జ్ఞానము పొందెదవు
2. జీవాహారము భుజించుమిపుదే జీవితమందు శక్తిని పొందు
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - జయమును పొందెదవు
3. సర్వమున్ ప్రభువుతో నారంభించి - సర్వమున్ ముగించు మాయనతో
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - ప్రభువే గొప్పవాడని
4. ఎవ్వరు ప్రభుసేవ చేసేదరో - ఎవ్వరాయనతో నడిచెదరో
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - పొందెదరు జీతమున్
5. తుఫాను మధ్య నీవుండినను - ధైర్యముగ నీవు నడువవలెన్
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - విశ్రాంతి పొందెదవు
6. నిద్రించి పొందకపోయి రేమియున్ - కలిగినదాని పోగొట్టుకొనిరి
నీ విపుడే (2) యెరుగు దీనిన్ - లేచి పొందు ఘనత
7. అంతము వరకు స్థిరముగ నుండిన - పొందెదవు ప్రభువిచ్చు ఘనత
నీ విపుడే (2) పొందెదవు - జీవకిరీటమును


Your favourites

  • No Favourites found!