Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మెల్లని చల్లని స్వరము యేసయ్యదే ఉల్లమంతటిని Telugu Christian Song Lyrics

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే ఉల్లమంతటిని Lyrics


మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్       ||మెల్లని||

శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము       ||మెల్లని||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో       ||మెల్లని||

గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును       ||మెల్లని||

మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా       ||మెల్లని||

Your favourites

  • No Favourites found!