మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు
1. పరమునుండి - బూర ధ్వనితో అరయు నేసు - ఆర్భాటముతో
సర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా
2. గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండ
చిరునవ్వుతో - చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా
3. క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానే
క్రీస్తువలె - తిరిగి లేతురు - లేతువా? నీవు ప్రియుడా
4. అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులై
పరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా
5. కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునా
మరణ సంహా - రుండేసు త్వరగా - రానై యున్నాడు
6. మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించిన
లేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము
7. పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమును
శాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మేలుకో! మహిమ రాజు వేగమే రానై Lyrics
Your favourites
- No Favourites found!
