Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ Telugu Christian Song Lyrics

మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ Lyrics

మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక
పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున ||మేలుకొనరే||

1.
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను
మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ ||మేలుకొనరే||

2.
పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను
రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ ||మేలుకొనరే||

3.
నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక
పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున ||మేలుకొనరే||

4.
మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు
నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ ||మేలుకొనరే||

5.
తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము
యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై ||మేలుకొనరే||

Your favourites

  • No Favourites found!