Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ Telugu Christian Song Lyrics

మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ Lyrics

మేము వెళ్లిచూచినాము స్వామి యేసుక్రీస్తును ప్రేమ మ్రొక్కి వచ్చినాము
మా మనంబులలరగ ||మేము||

1. బేదలేము పురములోన బీద కన్యమరియకుఁ బేదగా సురూపుఁ దాల్చి
వెలసెఁ బశులపాకలో ||మేము||

2. జ్ఞానులమని గర్వపడక దీనులమై నిత్యము వాని ప్రేమ సకల ప్రజకు
మానక ప్రకటింతుము ||మేము||

3. తద్దరిశనమందు మాకుఁ బెద్ద మేలు గలిగెగా హద్దులేని పాపమంత
రద్దుపరచబడెనుగా ||మేము||

4. మరణమెపుడొ రేపొమాపో మరియెపుడో మన మెరుగము త్వరగా
పోయి పరమగురుని దరిశనంబుఁ జేతము ||మేము||

5. హరిశుద్ధాత్మ జన్మ మాకు వరముగా నొసంగెను పరమపురము మాకు
హక్కు పంచెదాను నిరతము ||మేము||

6. మాకు సర్వగర్వమణిగి మంచి మార్గమబ్బెను మాకు నీ సువార్తఁ జెప్ప
మక్కువెంతోఁ గలిగెను ||మేము||

Your favourites

  • No Favourites found!