మూడునాళ్ళ ముచ్చట కోసం
ఈ మనిషి పడే తపన చూడరా ||2||
నీటిబుడగలాంటి జీవితం
ఏ నాడు సమసిపోవునో ఎరుగం ||2||
మనిషికి తన మనసే చేరసాలరా
మమతలు మమకారాలు బంధాలురా ||2||
వల్లకాటి వరకేరా భవబంధాలు
నీ కళ్లానికి చేరవురా అనుబంధాలు ||2||
కల్లలైన కళలు మానుకో
ఎల్లవేళలా ప్రభువని వేడుకో ||2|| ||మూడునాళ్ళ||
ఇంద్ర ధనుస్సు లాంటిదోయి సంసారము
అది కనిపించీ మాయమయే రంగులవలయం ||2||
గడ్డిపువ్వులాంటిదోయి ఇలలో సౌఖ్యం
అది పాపానికి జీతమురా మనిషికి మరణం ||2||
నిత్యమైన సుఖము వెదకరా
నిరతము ప్రభుని కోరరా ||2|| ||మూడునాళ్ళ||
తప్పిదములు దాచువాడు వర్దిల్లడు
అవి ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరా ||2||
జిగటగల ఊభినుండి పైకి లేపి
నీ పాదములను స్థిరముగా నిలుపును ప్రభువు ||2||
తీర్పు తీర్చబడకమునుపే
తప్పక ఆ ప్రభుని కోరరా ||2|| ||మూడునాళ్ళ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
మూడునాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి Lyrics
Your favourites
- No Favourites found!
