Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ కూసెనే ఆనందం వెల్లివిరిసెనే ఈ Telugu Christian Song Lyrics

ముద్ద బంతి పూసెనే కోయిలమ్మ కూసెనే ఆనందం వెల్లివిరిసెనే ఈ Lyrics

ముద్ద బంతి పూసెనే
కోయిలమ్మ కూసెనే
ఆనందం వెల్లివిరిసెనే
ఈ బంధం నిత్యం నిలిచెనే (2)

1. పెళ్లనే ఈ బంధం
అనురాగపు అనుబంధం
తీయనైన మకరందం
ఇగిరిపోని సుమగంధం (2)
తోడుగా ఈడు జోడుగా
జంటగా కనుల పంటగా (2)
పండాలి బ్రతుకు నిండాలి
దాంపత్యమే వెలుగుతుండాలి || ముద్ద ||

2. దేవుడే ఏర్పరచిన
దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు సంఘమునకు
పోల్చబడిన సంబంధం (2)
దేవుడే జత చేయగా
సాధ్యమా వేరు చేయగా (2)
కలతలే లేక సాగాలి
కలలన్ని నిజము కావాలి || ముద్ద ||

Your favourites

  • No Favourites found!