ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల రక్షకుని పలుకులు ముక్తిసాధన
ములకు మూలము భక్తిగొని యానంద మొందరే ||ముక్తి||
1. పాపభారము క్రింద శ్రమపడు పాపులారా రండు నేనే ప్రాపు నెమ్మది
మీకిడుదునని పరమరక్షకుఁ డాన తిచ్చెను ||ముక్తి||
2. ఇచ్ఛయించెడు వాఁడు యిచటికి వచ్చి జీవజలంబు రుచిగా పుచ్చు
కొనుగా కనుచుఁ బల్కెను సచ్ఛరితుఁడు మనుష్య పుత్రుఁడు ||ముక్తి||
3. ఆకసమునందుండి యిటు దిగి లోకమునకుఁ జీవము నొసఁగునది
ఈ కడనె యున్న దది నేనను యేసు ప్రభు వాక్కు మధురాన్నము ||ముక్తి||
4. నేనె మార్గము నేనె సత్యము నేనె జీవము నావలననే గాని యెపఁడును
తండ్రి యొద్దికి రానలవిగాదని వచించెను ||ముక్తి||
5. జీవజలము నుద్రావుటకు మీ భావన లనెడి పాత్ర ముంచుచు చేవఁ
గొని పానించుచు నిరత జీవమును వెలుఃగొంది బ్రతుకను ||ముక్తి||
6. ఎక్కడను యిటువంటి ప్రభువును మక్కువను వేసారి వెతకిన చిక్క(బో
డిటువచ్చి జూడుడి గ్రక్కునను జేసట్టు డిప్పుడే ||ముక్తి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ముక్తిఁ గనరే మీ మనంబుల శక్తిగల Lyrics
Your favourites
- No Favourites found!
