Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టిపరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టిదీక్షతో Telugu Christian Song Lyrics

ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టిపరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టిదీక్షతో Lyrics

ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టి
పరిశుద్ధ గ్రంధాన్ని చేతబట్టి
దీక్షతో నడుముకట్టి ఇంటింటి తలుపుతట్టి
యేసయ్య ఊసే చెప్పమ్మా - ఊరకనే ఉంటే తప్పమ్మా


1. ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా
పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా
ఇక్కడ మాటలు అక్కడ చెప్పి - మంచిని చెడుగా తిప్పి
రెచ్చగొట్టే పనులే మానమ్మా - చిచ్చుపెట్టబాకే చిన్నమ్మా


2. కల్పించిన కధలంటే చెవి కోసుకుంటావమ్మా
చేడుమాటల సభాలంటే నువ్వే ముందుంటావమ్మా
విన్నదానికి కోసరువేసి - ఉన్నదాన్ని మార్చేసి
కొండాలు చెప్పవద్దమ్మా - జగడాలు పెట్టకు పెద్దమ్మా


3. మంచిగ ఉన్నోళ్ళని చుస్తే కళ్ళెర్ర జేస్తావమ్మా
హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా
వ్యంగపుమాటల కత్తులుదూసి - చల్లగ గుండెను కోసి
గాయాలు చేయ్యవోద్దమ్మా - నోటికి ఉండాలి హద్దమ్మా

Your favourites

  • No Favourites found!