Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Telugu Christian Song Lyrics

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము Lyrics

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము     ||నా బ్రతుకు||

ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని     ||నా బ్రతుకు||

నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం     ||నా బ్రతుకు||

Your favourites

  • No Favourites found!