నా పాపమే నిను లోకము చేర్చేను
నా దోషమే నిను సిలువను వెసేను (2)
నేనే గా పెంచితి నీ భారం!
తండ్రికి నిను చెసితిని దూరం (2) || నా పాపమే ||
1. ఆ గెత్సేమనే వనము లోన –
నువ్వు చేసిన ఆ ప్రార్థనలో
నీ రుధిరము స్వేదము బిందువులుగా మారి –
ఎడతెగకుండా కురిసిన (2)
నువ్వు నలుగుట తండ్రి కోరెను!
నా పాపము నీపై మోపెను (2)
నువ్వు చూపిన వినయమే కాదా?
నా పాలిట వెలకట్టని క్రయధనముగ మారెను
|| నా పాపమే ||
2. ఆ సిలువలో, నీ బాధలలో చూచితిని నా పాపము
నీ ప్రేమతో కార్చిన రుధిరం –
చెల్లించేను నా మూల్యము (2)
ఈ మరణము నాకోసమే!
నీ యాతన నా లోపమే (2)
ఏమున్నది నాలోన ఘనము!
నీ ప్రాణము పెట్టి నన్ను చేర్చితివి పరము
|| నా పాపమే ||
