Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో Telugu Christian Song Lyrics

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో Lyrics

నా ప్రాణ ప్రియుడా మహనీయుడా
నా యేసయ్యా నీతో ఉంటానయ్యా

నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా
నీతోనే ఉంటానేసయ్యా నిను విడువలేనయ్యా
                                                 || నా ప్రాణ ||
1. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా (2)
శ్రమలు శోధించినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2)
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా  (2)
                              || నీవే కావలేసయ్యా ||
2. కన్నీరే సముద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా (2)
నే నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా (2)
ప్రాణం పోయేంతవరకు నీతోనేనయ్యా
తుదిశ్వాస వరకు నీతో ఉంటానయ్యా  (2)
                              || నీవే కావలేసయ్యా ||

Your favourites

  • No Favourites found!