నా ఆత్మియా యాత్రలో ఆరణ్య మార్గములో
నాకు తోడైన యేసయ్యా నిను ఆనుకొని జీవించెద
నేనేల భయపడను నా వెంట నీవుండగా
నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా
1 శ్రేష్టమైన నీ మార్గములో నీత్యమైన నీ బాహువుచాపి
సమృద్ధి జీవము నాకనుగ్రహించి నన్ను బలపరచిన యెసయ్యా
నిన్ను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను " నేనేల " " నా ఆత్మ "
2 పక్షిరాజువలె పైకెగురుటకు నూతన బలముతో నింపితిని
జేష్ఠుల సంఘములో నను చేర్చి పరిశుద్ద పరిచే యేసయ్యా
అనుదినము నిన్ను స్తుతించుటకు నేని జీవింతును " నేనేల " " నా ఆత్మ "
3 సేయోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితిని
కృపావరముతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్యా
నీ రాకకొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము " నేనేల " " నా ఆత్మ "
