Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
నా బలమా ఆలకించుమానా బలమా ఆదరించుమాఇంటి Telugu Christian Song Lyrics

నా బలమా ఆలకించుమానా బలమా ఆదరించుమాఇంటి Lyrics

నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా ॥ఇంటి॥
1॰
వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥
2॰
తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా ॥ఇంటి॥

Your favourites

  • No Favourites found!